హాయ్‌లాండ్

హాయ్‌లాండ్

గుంటూరు..కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పర్యాటకులను ఆకట్టుకున్న ప్రాజెక్టుల్లో ‘హాయ్‌లాండ్’ ప్రాజెక్టు ఉంది.బుద్ధిజం థీమ్ పార్కు ప్రాజెక్టే హాయ్ లాండ్. విజయవాడ- గుంటూరు నగరాల మధ్య మంగళగిరి సమీపంలో 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ హాయ్ లాండ్ ప్రాజెక్టును నెలకొల్పారు. సన్ ప్లాజా, చైనా, కాంబోడియా,థాయ్‌లాండ్‌, టిబెట్, బర్మా, ఇండో నేషియా, జపాన్ జోన్లుగా ఇక్కడ రకరకాల జోన్లు ఏర్పాటు చేశారు. వాటర్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా పిల్లల కోసం పలు గేమింగ్ జోన్లు..వినోద కేంద్రాలు హాయ్ లాండ్ లో దర్శనం ఇస్తాయి. చైనా బజార్ తరహాలో ఇక్కడ షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. పంచకోశ, పంచకర్మ, త్రికాయ చికిత్సలతో పాటు, యోగా,ఫిజియోథెరపీ కేంద్రాలు హాయ్ లాండ్ ప్రత్యేకతలు.

Similar Posts

Share it