బెలూన్ ట్రిప్స్..అంతరిక్షం అంచుల వరకూ!

బెలూన్ ట్రిప్స్..అంతరిక్షం అంచుల వరకూ!

టిక్కెట్ ధర కోటి రూపాయలు!

అంతరిక్షం అంచుల వరకూ వెళ్ళాలనుకుంటున్నారా?. ఏకంగా భూమి నుంచి లక్ష అడుగుల ఎత్తుకు ఎగిరిపోయి అక్కడ నుంచి అంతరిక్షం అందాలను వీక్షించే వెసులుబాటు పర్యాటకులకు లభించబోతోంది. అంతే కాదు.. లక్ష అడుగుల ఎత్తులో నుంచి సూర్యోదయం కూడా చూసే అవకాశం రాబోతుంది. లక్ష అడుగుల ఎత్తుకు వెళ్ళి ఆ ఫీలింగ్ అనుభవించటం అంటే వావ్ అనాల్సిందే. అయితే ఈ కల నెరవేర్చుకోవాలంటే ఖర్చు కూడా అంతే భారీగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అమెరికాకు చెందిన ఓ కంపెనీకి దీనిని పెడుతున్న టిక్కెట్ ధర సుమారు కోటి రూపాయల వరకూ ఉండబోతుంది. అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన ‘స్పేస్ పర్ స్పెక్టివ్’ ఈ హైటెక్ బెలూన్ ట్రిప్స్ కు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ కంపెనీ ఎలాంటి సిబ్బంది లేకుండా ఈ టెస్ట్ ఫ్లైట్ ను పరిశీలించనుంది.

ఈ పరీక్ష అనంతరం అంతరిక్షం అంచుల వరకూ పర్యాటకులను తీసుకెళ్ళనున్నారు. ఆరు గంటల పాటు ఈ ప్రయాణం ఉంటుంది. ఈ బెలూన్ జర్నీలో ప్రయాణికుల కోసం రిఫ్రెష్ మెంట్ బార్ కూడా ఉంటుంది. సహజంగా వాణిజ్య విమానాలు 30 నుంచి 35 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. కానీ ఈ బెలూన్ ట్రిప్ ఏకంగా లక్ష అడుగుల ఎత్తుకు వెళుతుంది. ఇందులో ప్రయాణించే వారు అంతరిక్షం అంచుల వరకూ వెళ్ళి ప్రత్యేక అనుభూతులను పొందవచ్చు. అయితే ఇది చాలా ఖరీదైన వ్యవహారంగా నిలుస్తుంది. ‘స్పేస్ షిప్ నెప్ట్యూన్’ గా పిలిచే ఈ బెలూన్ లో ఎనిమిది మంది ప్రయాణికులను తీసుకెళ్ళగలుగుతుంది. ఈ హైడ్రోజన్ బెలూన్ ఫుట్ బాల్ స్టేడియం సైజులో ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it