వట్టెం వేంకటేశ్వరస్వామి దేవాలయం

వట్టెం వేంకటేశ్వరస్వామి దేవాలయం

నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని బిజినేపల్లి మండలంలోని వట్టెంగుట్టపై ఉన్న వేంకటేశ్వరస్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది.ఈ ప్రాంతాన్ని రెండో తిరుపతిగా ఈ ప్రాంత ప్రజలు చెప్పుకొంటారు.బిజినేపల్లి మండల కేంద్రానికి 9 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది. వట్టెం వెంకన్న దర్శనం సర్వదుఖ:పరిహారంగా ప్రజలు భావిస్తారు. వట్టెం గ్రామం ఆగ్నేయాన మరో గట్టు ఉంది. అది గండ్ల సర్వ, వట్టెం గ్రామాలకు నడుమ ఉంటుంది. అందుకే ఆ ప్రాంతానికి అడ్డగట్టు అనే పేరు వచ్చింది. దానిపై ఒక చోరికలో పురాతనమైన లింగప్రతిష్ట జరిగింది. ఆ దేవుని పేర పూర్వం గుట్ట కింద లింగాపురం ఉన్నది. దాని క్షేత్రపాలకుడిగా వేంకటేశ్వరస్వామి ఆ గుట్టపై ఉన్నారు. అందుకే ఈ ప్రాంతానికి క్షేత్రపాలకుని గుట్ట అనే పేరు కూడా వచ్చింది. లింగాపురం క్రమక్రమంగా వట్టెం గ్రామంగా మారిపోయింది. గుడ్ల సర్వలో ఈ జిల్లాకు భగవన్నామ ప్రచారకుడు అయిన చింతకుంట నరసింహారావు ఉన్నారు.

ఆయన ఆశ్రమం కొరకు ఆ గట్టుపై ఉన్న స్థలాన్ని తీసుకుని..దాని పక్కన శ్రీ కుసుమ హరనాథ బాబా ఆశ్రమాన్ని నెలకొల్పారు. వట్టెం గ్రామంలో సందడి రంగారెడ్డి ప్రముఖుడు. ఆయన పీడబ్ల్యూడీ శాఖలో ఇంజనీర్ గా..కాంట్రాక్టర్ గా ఉండేవారు. రంగారెడ్డికి ధార్మిక చింతన, దైవభక్తి ఎక్కువ. ఆయనకు ఎక్కడైనా వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టించాలనే కోరిక ఉండేది. నరసింహారావు సంకల్పం. రంగారెడ్డి ధార్మిక చింతన తోడు అవటంతో వట్టెం గ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయం కొలువుదీరింది.రంగారెడ్డి దేవాలయం భారాన్ని అంతా తనమీదే వేసుకున్నారు. 1982నవంబర్ 4న అప్పటి చేనేత శాఖా మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ దేవాలయానికి శంకుస్థాపన చేశారు. 1986 మే 19న శ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి కరకమలాలతో స్వామివారి ప్రతిష్టా మహోత్సవం జరిగింది. కొండపై ఉన్న ఈ దేవాలయాన్ని నిత్యం పెద్ద ఎత్తున భక్తులు సందర్శిస్తుంటారు.

Similar Posts

Recent Posts

International

Share it