విస్తారా ఎయిర్ లైన్స్ ఆన్ బోర్డు వై ఫై సేవలు ప్రారంభం

విస్తారా ఎయిర్ లైన్స్ ఆన్ బోర్డు వై ఫై సేవలు ప్రారంభం

విస్తారా ఎయిర్ లైన్స్ శుక్రవారం నుంచే ఆన్ బోర్డు వై ఫై సేవలు అందించనుంది. ఈ సేవలు అందిస్తున్న తొలి భారతీయ ఎయిర్ లైన్స్ గా విస్తారా రికార్డులకు ఎక్కనుంది. ఢిల్లీ నుంచి లండన్ వెళ్ళే బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ సర్వీసుల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఉచితంగా అందించనున్న ఈ సేవలకు త్వరలోనే ఎయిర్ లైన్స్ ఛార్జీలను ఫిక్స్ చేయనుంది. ఎయిర్ బస్ 321 నియో ఫైట్లలోనూ ఈ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు విస్తారా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు విదేశీ ఎయిర్ లైన్స్ ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

ప్యానాసోనిక్ ఏవియోనిక్స్ సిస్టమ్ తో అందించే ఈ విస్తారా ఆన్ బోర్డు వై ఫే సేవల ద్వారా ప్రయాణికులు మొబైల్ ఫోన్లతోపాటు ట్యాబ్ లు, ల్యాప్ టాప్స్ ద్వారా ఇంటర్నెట్ సేవలు పొందవచ్చు. ప్రస్తుతం విస్తారా చేతిలో రెండు డ్రీమ్ లైనర్ విమానాలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన ఎయిర్ లైన్స్ అన్నీ ఈ సేవలు ప్రారంభించేందుకు రెడీ అయినా..ప్రస్తుతం తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎయిర్ లైన్స్ ప్రస్తుతానికి ఈ సర్వీసులను పక్కన పెట్టాయనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో పోటీని తట్టుకోవాలంటే అన్ని ఎయిర్ లైన్స్ కూడా ఇదే బాట పట్టక తప్పనిపరిస్థితి ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it