ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎక్కడో తెలుసా?

వాటర్ ఫాల్స్.ఈ పేరు చెపితేనే ప్రకృతి ప్రేమికులు పులకరిస్తారు. పర్యాటకులు ఎక్కడెక్కడ ఇవి ఉన్నాయా అని వెతుకుతుంటారు. చుట్టూ ఎత్తైన కొండలు..పచ్చటి ప్రదేశాలు..కొండలపై నుంచి జాలువారుతున్న నీటిని చూస్తే ఎవరైనా ఆనందంతో తాండవించాల్సిందే. అందులో ప్రపంచంలో ప్రత్యేక స్థానం ఉన్న వాటిని చూస్తే ఆ అనుభూతే వేరు. ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయనే వివరాలను ‘ట్రావెలోకం.కామ్’ వెబ్ పాఠకుల కోసం...ప్రపంచంలోనే ఎత్తైన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా?. వెనిజులాలో. ఈ వాటర్ ఫాల్స్ కు ఆ సీజన్...ఈ సీజన్ అన్న తేడా ఉండదు. 365 రోజులూ అక్కడ నుంచి నీరు జాలువారుతూనే ఉంటుంది. అవే ‘ఏంజెల్ ఫాల్స్’. దక్షిణ అమెరికాలోని వెనిజులాలో ఉన్న అతి పెద్ద జాతీయ పార్కు అయిన కెనామా నేషనల్ పార్కులో ఈ ఏంజెల్ ఫాల్స్ ఉన్నాయి. 3230 మీటర్ల ఎత్తున నుంచి నీళ్లు కిందకు జాలువారుతుంటాయి.

ప్రపంచంలోనే అత్యంత ఆకర్షణీయమైన వాటర్ ఫాల్స్ తో ఇదే మొదటి స్థానంలో ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు పెద్దగా ఎవరూ గుర్తించని ప్రపంచంలోనే ఎత్తైన ఈ వాటర్ ఫాల్స్ ను 1933లో జేమ్స్ క్రాఫోర్డ్ (జిమ్మీ) ఖనిజాల కోసం తిరుగుతూ ఈ వాటర్ ఫాల్స్ ను గుర్తించాడు. కెనామా నేషనల్ పార్కులో ఎన్నో ఉష్ణమండల వన్యప్రాణులు కూడా పర్యాటకులకు దర్శనమిస్తాయి. పార్కుకు వచ్చిన తర్వాత పర్యాటకులు బోట్ లో ఈ వాటర్ ఫాల్స్ ప్రాంతానికి చేరుకోవచ్చు. అంతే కాదు..కెమామా ఎయిర్ స్ట్రిప్ నుంచి విమానంలో కూడా వీటి అందాలను వీక్షించవచ్చు. ప్యారిస్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ఈఫిల్ టవర్ కంటే మూడు రెట్లు ఎత్తున ఉంటాయి.

https://www.youtube.com/watch?v=C_s-MNZAVjs

Similar Posts

Recent Posts

International

Share it