యాగంటి

యాగంటి

కర్నూలు జిల్లాలో బ్రహ్మం గారు నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి. ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపచేసే పుణ్యక్షేత్రాలలో ఇది ఒకటి. యాగంటి దేవాలయం కర్నూలు జిల్లాల్లో చాలా ప్రసిద్ధి చెందినది. యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ ఉమామహేశ్వరుని లింగం ఉంది. తొలుత ఈ ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని భావించారు.

కానీ తయారయిన విగ్రహంలో చిన్న లోపం ఉండడంతో వేంకటేశ్వరుని విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని, స్వయంభువుగా ఆ చుట్టు పక్కల వెలసిన ఉమా మహేశ్వర స్వామి వారిని తీసుకుని వచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉంది. లోప భూయిష్టమైన శ్రీ వేంకటేశ్వరస్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికి దర్శించుకోవచ్చు. ఇక్కడున్న పుష్కరిణి లోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది.

Similar Posts

Recent Posts

International

Share it