పెనుకొండ

Update: 2019-04-28 12:14 GMT

పెనుకొండ విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందింది.పెనుకొండ శతృదుర్భేద్యమైన దుర్గం. ఈ కోటను బుక్కరాయుడు కట్టించారు. ఈ కోటలో ఎన్నో పురాతన శాసనాలు ఉన్నాయి. ఎర్రమంచి గేటులో 1575లో నిర్మించిన 11 అడుగుల ఆంజనేయుడి విగ్రహం ఉంది.విజయనగర రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు ఇక్కడ పూజలు చేసేవారట. పెనుకొండలో 365 దేవాలయాలు ఉన్నాయి. వీటిని కృష్ణదేవరాయలు నిర్మించాడు. విజయనగర రాజ్య పతనానంతరం విజయనగరం నుండి ఏనుగులు..గుర్రాలపై విజయనగర సంపదను తరలించి పెనుకొండ కోటలోనూ, చిత్తూరు జిల్లా చంద్రగిరి కోటలోనూ దాచారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే కాబోలు గుప్తనిధుల కోసం ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. పెనుకొండపై నిర్మించిన నర్సింహస్వామి దేవాలయం, కోనేరు, చెరువు చూడదగ్గ ప్రదేశాలు.

Similar News

గుత్తి కోట