మంథని

Update: 2019-04-14 12:18 GMT

తెలంగాణలో వేద, శాస్త్రాల బోధనా కేంద్రం మంథని. గోదావరి నదీ తీరాన వెలసిన ఈ వేద పాఠశాల నేటికీ వేదంలో ఆరితేరిన ఎందరో పండితులకు నిలయం. ఎన్నో ప్రముఖ ఆలయాలకు ఆదరణా కేంద్రంగా నిలుస్తోంది. వీటిలో .శైలేశ్వరుడు, గౌతమేశ్వరుడు,లక్ష్మీనారాయణస్వామి, ఓంకారేశ్వరుడు, మహాలక్ష్మి దేవాలయాలు కీలకమైనవి. జైనమతానికి, బౌద్ధమతానికి కూడా మంథని పేరుగాంచింది. మంథనికి ఉత్తరాన గోదావరి నది, దక్షిణాన బొక్కల వాగు అనే చిన్న యేరు, తూర్పున సురక్షిత అడవి, పశ్చిమాన రావులచెరువు హద్దులుగా ఉన్నాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఈ ప్రాంతం ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో ఉంది.

హైదరాబాద్ నుంచి 235 కిలోమీటర్ల దూరంలో, కరీంనగర్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

Similar News

నగునూరు
ధర్మపురి